Penerbit bertanggung jawab penuh atas isi pengumuman ini
మేడమ్ టుస్సాడ్స్ గురించి :
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేడమ్ టుస్సాడ్స్ ని ప్రతి సంవత్సరం
కోటి మందికి పైగా టూరిస్టులు సందర్శిస్తుంటారు. వారందరికీ అక్కడ టాప్ సెలబ్రిటీలను
పోలి ఉండేలా తయారు చేసిన వాక్స్ స్టాచ్యు లతో టూరిస్ట్ లకు తమ అభిమాన తారలని కలిసిన
అనుభవాన్ని అందిస్తుంది.
లండన్ లో ప్రారంభమై ప్రపంచవ్యాప్తంగా, న్యూ యార్క్, షాంఘై,
ఆమ్స్టర్డామ్, సిడ్నీ వంటి 23 చోట్ల మేడమ్ టుస్సాడ్స్ విస్తరించి ఉంది. 250 సంవత్సరాల
చరిత్ర కలిగిన మేడమ్ టుస్సాడ్స్ వేలాదిమందిప్రముఖుల వాక్స్ స్టాచ్యు లను తయారు చేసి ప్రదర్శనగా ఉంచుతోంది. సందర్శకులకు
వారి అభిమాన తారలతో కలిసి ఫోటోలు తీసుకునే అవకాశం కల్పిస్తోంది.
ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా తారలోకంలో మీరూ ఒక
తారగా వెలిగేందుకు మేడమ్ టుస్సాడ్స్ మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. ప్రాచీన కాలం నుండి
ఇప్పటి వరకు సహజంగా ఉండే సెట్లు, వాతావరణాన్ని సృష్టించడంతో పాటు అత్యాధునిక టెక్నాలజీ
తో మరపురాని అనుభవాన్ని అందించడానికి మేడమ్ టుస్సాడ్స్ సిద్ధంగా ఉంది.